భారీ వర్షాల కారణంగా జలదిగ్బంధంలో నారాయణపురం గ్రామం
జలదిగ్బంధంలో నారాయణపురం గ్రామం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. మండలంలోని నారాయణపురం గ్రామం పూర్తిగా జలమయం అయ్యింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో గ్రామంలోని ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు.