అనపర్తి: ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిపై అనపర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదుక్క్
ఓ మహిళను కోరిక తీర్చాలంటూ వేధిస్తున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రామారావు తెలిపారు. మండలంలోని ఒక గ్రామంలో ఓ మహిళ తన కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమెను రామవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజులుగా తన కోరిక తీర్చమని వేధిస్తున్నాడు. ఈనెల 10వ తేదీ రాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. శుక్రవారం పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.