కోడేరు: ఎత్తంలో మామిడి మొక్కలను నరికివేసిన గుర్తుతెలియని వ్యక్తులు, కేసు నమోదు
కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పొలంలోని నాలుగు సంవత్సరాల మామిడి మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సుమారు 20 మొక్కలను నరికి వేశారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతు తెలిపారు .రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.