అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం గుండులు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు దీనికి సంబంధించిన వివరాలు ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు. గ్రామ సమీపంలో రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్న రాములమ్మ అనే మహిళను బైక్పై వేగంగా వస్తున్న ఇద్దరు యువకులు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల ఏరియా హాస్పిటల్ కి తరలించామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.