కోరుట్ల: మెట్పల్లి 'ఎరువుల డీలర్స్ ఈపాస్ ద్వారా
అమ్మకాలు చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్
మెట్పల్లి.ఎరువుల డీలర్స్ ఈపాస్ ద్వారా అమ్మకాలు చేయాలి ఎరువుల డీలర్లు ఈపాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల, బండలింగాపూర్ గ్రామాలలో ఆయన ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డు, ఈపాస్ మిషన్లను పరిశీలించారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. జిల్లా అధికారితో పాటు ఏవో లావణ్య, ఏఈవో మమత ఉన్నారు.