కుల్చారం: గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్య సేవలు అందజేస్తాం: మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం రామాయంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.