కొడంగల్: మండలంలో ఖాజా అహమ్మద్ పల్లి గ్రామ శివారులో పిడుగుపాటుకు గురై 25 మేకలు, గొర్రెలు మృతి
వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలంలోని హాజర అహ్మద్ పల్లి గ్రామ శివారులో గురువారం పిడుగుపాటుకు గురై అదే గ్రామానికి చెందిన రైతు పకీరప్పకు చెందిన 25 మేకలు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మేకలు, గొర్రెల మృతి వల్ల రైతుకు సుమారు 3లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పకీరప్ప ప్రభుత్వానికి వేడుకుంటున్నారు.