గంగాధర నెల్లూరు: ప్రకృతి వ్యవసాయంతో ప్రయోజనం : శ్రీరంగరాజపురం గ్రామంలో ఏడీ కవిత
ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యానికి మేలు అని నగరి ఏడీ కవిత అన్నారు. మండలంలోని శ్రీరంగరాజపురం గ్రామంలో సుభాష్ పాలేకర్ పద్ధతిలో పృథ్వి మిత్ర రైతు సంఘ సభ్యుడు గోపాల్ నాయుడు పండిస్తున్న మిశ్రమ పంటలను గురువారం కవిత పరిశీలించారు. చీడపీడల నివారణకు సకాలంలో కషాయాలు, జీవామృతం పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమానికి మండల వ్యవసాయధికారి కుసుమ, రైతులు దేవరాజ్, ప్రేమ్ చంద్ పాల్గొన్నారు.