శ్రీకాకుళం: బంజీరుపేటలో కారులోవచ్చి 5 మేకలను దొంగిలించకపోయినా గుర్తుతెలియని వ్యక్తులు, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన కాశీబుగ్గ సీఐ
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మోదుగులపుట్టి గ్రామ సమీపంలో ఉన్న బంజీరుపేట లో అర్థ రాత్రి దాటిన వేళ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు 5 మేకలను దొంగలించుకుపోయారు. అనంతరం ఆ మేకులను శ్రీకాకుళంలో రూ. 30 వేలుకి అమ్మి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఈ క్రమంలో మేకలు దొంగతనానికి గురైన విషయాన్ని గ్రహించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చకసక్యంగా వ్యవహరించి నలుగురు దొంగలతో పాటు ఐదు మేకలను స్వాధీనం చేసుకున్నట్లు కాశిబుగ్గ సీఐ సూర్యనారాయణ బుధవారం ఉదయం మీడియాతో తెలిపారు.