గంగాధర నెల్లూరు: SRపురం మండలం పోధలపల్లి హరిజనవాడలో ఇరు వర్గాల మద్య ఘర్షన
వాట్సాప్ గ్రూపుల్లో పరస్పర అసభ్య పదజాలం ఉపయోగించి పోస్టులు చేయడంతో 2 వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన SRపురం మండలం పోధలపల్లి హరిజనవాడలో జరిగింది. ఆనందరావు ఇంటిపై ఏకాంబరం, భరత్, లోకేశ్, రాజేశ్, చరణ్ మారణాయుధాలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘర్షనలో ఆనందరావు, భారతి, జానీ, మార్కొండయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఎస్ఆర్పురం SI సుమన్ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.