మేడ్చల్: ఘట్కేసర్ లో అర్థ ఎకరంలో అందెశ్రీ స్ఫూర్తి వనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో అందెశ్రీ అంత్యక్రియలు అనంతరం, ఆయన స్ఫూర్తి వనం కోసం ప్రభుత్వం అర్థ ఎకరం స్థలానికి కేటాయించింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఈ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.