అనంతపురం: నగర శివారులోని చంద్రబాబు కొట్టాలలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి వ్యక్తికి గాయాలు
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న చంద్రబాబు కొట్టాలలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో రామాంజనేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో పక్కనే ఉన్న గోడను ఢీకొనడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.