నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతను పర్యవేక్షించారు. డీఎస్పీ ప్రమోద్, సీఐ రమణ, ఎస్సై వరప్రసాద్ ఆలయ పరిసరాలను సందర్శించారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.