ఆర్మూర్: ఆర్మూర్ MPDO కార్యాలయం వద్ద నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమూనా ను పరిశీలించిన ఎంపీడీవో, హౌసింగ్ డి ఈ
ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమూనాను మంగళవారం మధ్యాహ్నం 3:50 ఎంపీడీవో శివాజీ ఆర్మూర్ హౌసింగ్ డి నరసింహారావు పరిశీలించారు. షేర్ వాల్ టెక్నాలజీ తో 15 రోజుల్లో ఇందిరమ్మ ఇంటి నమూనా 5 లక్షల లోపు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లును నిర్మించాలనుకునే వారు ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించి తమ ఇండ్ల పనులను ప్రారంభించుకోవాలని తెలిపారు.