ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో నూతన సంవత్సర సందర్భంగా టిడిపి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు.