పాణ్యం: ప్రజా వైద్య వ్యవస్థను కాపాడాలి : పాణ్యం మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
పాణ్యం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. బుధవారం వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ విద్యార్థులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రజా వైద్య వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.