కర్నూలు: డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరిక
డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరిక. జనవరి నుంచి నవంబర్ 30 వరకు 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.హెల్మెట్ తప్పనిసరి, రోడ్డు నియమాలు పాటించాలి అని ఎస్పీ సూచించారు. మొబైల్లో మాట్లాడాలంటే వాహనం ఆపి మాట్లాడాలని, లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరిక.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.