గాస్పల్ అసెంబ్లీ చర్చ్ ఆధ్వర్యంలో కుర్రకోడు గ్రామంలో క్రైస్తవులపై జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అనంతపురం నగరంలోని కోర్ట్ రోడ్డు నుండి ర్యాలీ కొనసాగింది. కూడేరు మండలం కుర్రకోడు గ్రామంలో శాంతి సందేశం ఇచ్చేందుకు క్రిస్టియన్ మత పెద్దలు గ్రామానికి చేరుకోగా అక్కడ ఉన్న మతోన్మాదులు వాహనాలపై మూకుమ్మడి దాడులు నిర్వహించి విధ్వంసం సృష్టించారని గాస్పల్ అసెంబ్లీ చర్చ్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంఘటనకు నిరసనగా నగరంలోని చర్చి సభ్యులు పాస్టర్లు, భక్తుల ఆధ్వర్యంలో కోర్ట్ రోడ్ నుండి సప్తగిరి సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.