మూసాపేట్ మెట్రో స్టేషన్ లో బుల్లెట్లు కలకలం రేపాయి. మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడు వద్ద బుల్లెట్ కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై కూకట్పల్లి సీఐ సుబ్బారావు వివరాలు వెల్లడించారు. ప్రగతి నగర్ లోని నివాసానికి వెళ్లి విచారించినట్లు వెల్లడించారు. ఆలం బిహారీ వాసి,ఆయన యువకుడి తల్లితోనే ఉంటున్నాడు. ఆలం ఫ్యామిలీలో ఒకరు మిలిటరీలో చేసేవారు. ఆ సమయంలో బుల్లెట్ ను తన వెంట తెచ్చుకున్నట్లు తెలిపారు. ఇది చట్ట ప్రకారం నేరమని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెల్లడించారు.