కుప్పం: కుప్పంలో వైసీపీ నాయకుల ఆందోళన
కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నిరసన చేపట్టింది. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. కల్తీ మద్యం, గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్తీ మద్యాన్ని అరికట్టడంతో పాటు బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.