గత ప్రభుత్వం తప్పిదాలు ఈ ప్రభుత్వానికి శాపంగా మారాయి: ఘనసరి గ్రామంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
గత ప్రభుత్వ తప్పిదాలు ఈ ప్రభుత్వానికి శాపంగా మారాయని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలోని ఘనసరి గ్రామంలో ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏనుగుల దాడిలో ధ్వంసమైన జొన్న పంట పొలాలను పరిశీలించారు. గత ప్రభుత్వ సమయంలో జరిగిన పంట నష్ట పరిహారం చెల్లింపు నిర్లక్ష్యం పట్ల అటు విశాఖ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పంట నష్టపరిహారం కంటే ఏనుగుల సమస్య లేకుండా చూడాలని అక్కడ రైతులు కోరారు.