సిర్పూర్ టి: పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన
కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని అధికారులు వెంటనే స్పందించి బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు సిపిఎం పార్టీ నాయకుడు ఆనంద్ కుమార్ సంఘీభావం తెలియజేశారు.