సంగారెడ్డి: అధిక శబ్దం చేస్తున్న 16 సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు
అధిక శబ్దం చేస్తున్న 106 సైలెన్సర్లను సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనిఖీల్లో పట్టుబడ్డ సైలెన్సర్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. బైక్‌లకు అధిక శబ్దం చేసే సైలెన్సర్లను పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రమేష్, ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.