మెదక్: వెంకటాపూర్ కె గ్రామంలో రేషన్ కార్డు ద్వారా యూరియా బస్తాల పంపిణీ
Medak, Medak | Sep 16, 2025 నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ (కె) గ్రామంలో గ్రామానికి 540 యూరియా బస్తాల లోడ్ రావడంతో గ్రామస్తులకు రేషన్ కార్డు ద్వారా ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు దయాకర్ మాట్లాడుతూ యూరియా కొరతా నేపథ్యంలో గ్రామంలో రేషన్ కార్డు ద్వారా యూరియా బస్తాలను రైతులకు అందించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో రైతులకు యూరియా బస్తాలను తీసుకెళ్తున్నారని తెలిపారు. గతంలో గ్రామానికి సొసైటీ సబ్ సెంటర్ ఉండేదని కొన్ని అనివార్య కారణాల వల్ల మూసివేయడం జరిగిందని మళ్లీ సబ్ సెంటర్ ను పున: ప్రారంభించుకొని రైతులకు యూరియా అందిస్తున్నామన్నారు.