గుంతకల్లు: గుత్తి కోటను అభివృద్ధి చేయడానికి అవసరమైన రోడ్డు మ్యాప్ తయారు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆనంద్
గుత్తి కోట అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని రోడ్డు మ్యాప్ తయారు చేయాలని స్థానిక రెవెన్యూ, ఆర్కియాలజీ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. గుత్తి కోటను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గుత్తి కోట వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ కోటను అభివృద్ధి చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ రోడ్డు మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అందరి సహకారంతో కోట ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.