విజయనగరం: తమ సమస్యలు పరిష్కరించాలని రాజాంలో రోడ్డెక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డేక్కారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం APTF నిరసన తెలిపింది. ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయలు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న డీఏలు తక్షణమే చెల్లించాలని, CPS విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. పలు రాష్ట్రాల్లో ఐ.ఆర్ ప్రకటించాయని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం ఐఆర్ ప్రకటించకపోవడం దారుణమని APTF జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ మండిపడ్డారు.