శంషాబాద్: విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ప్రభుత్వ హాస్టళ్ళు, అన్ని గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంచిన సందర్భంగా శనివారం శంషాబాద్ లోని బీసీ బాలర సంక్షేమ హాస్టల్ ను సందర్శించి, విద్యార్థుల యోగ క్షేమాలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్లో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేసి వంట గదిని సందర్శించారు. తెలంగాణలో గురుకుల పాఠశాల, హాస్టల్ విద్యర్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.