పులివెందుల: భారీ వర్షాల కారణంగా నేలకొరిగిన వరి పంట
Pulivendla, YSR | Oct 25, 2025 బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం కారణంగా గత మూడు రోజులుగా కూర్చున్న వర్షాల కారణంగా కడప జిల్లా వేంపల్లి మండలం లో సాగుచేసిన వరి పంటలు దెబ్బతిన్నాయి. పొట్ట దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. ఈ అనూహ్య వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలం పరిధిలోని ఇడుపులపాయ, వీరన్నగట్టుపల్లి, వేంపల్లి, కుమరాంపల్లి, అలిరెడ్డిపల్లి తో పాటు తదితర గ్రామాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో ఇలా వర్షాలు కురవడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ కష్టానికి తగిన ఫలితం లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.