మేడ్చల్: సైనిక్‌పురిలో టపాసులు కాలుస్తూ తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి
హైదరాబాద్ సైనిక్‌పురిలో బుధవారం టపాసులు కాలుస్తూ కార్తీక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలాజీ నగర్ లోని మార్కెట్ విధికి చెందిన కార్తిక్, తన స్నేహితులతో కలిసి సైనిక్‌పురిలో టపాసులు కాలుస్తుండగా అవి ఒక్కసారిగా పేలిపోవడంతో అతని ముఖం కాలిపోయి, కళ్ళకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పటాసులు కాలుస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.