సంగారెడ్డి: సదర్ సమ్మేళనంలో సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ అతిథి గృహం వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన సదర్ సమ్మేళనంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దున్నపోతుపై కూర్చుని సందడి చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సదర్ సమ్మేళనం ఐక్యతకు గుర్తుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం శ్రీకృష్ణుని కీర్తిస్తూ భజన పాటలు చేస్తూ నృత్యాలు చేస్తూ ఉత్సహ పరిచారు. పట్టణంలో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తో పాజి అనంత కిషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.