తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో మట్క స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన టౌన్ పోలీసులు
తాడిపత్రిలో మట్కా స్థావరాలపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు. టౌన్ సీఐ ఆరోహణరావు తన సిబ్బందితో కలిసి నందలపాడు, బంకమట్టివీధి, శ్రీనివాసపురం ప్రాంతాలలో దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల నుంచి రూ.4లక్షల నగదు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జూదాలకు అలవాటు పడితే కుటుంబాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు.