దెందులూరు సత్యనారాయణపురం వద్ద హైవే పై ఘోర రోడ్డుప్రమాదం, బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి
Eluru Urban, Eluru | Sep 17, 2025
ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం సమీపంలోని జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. బుధవారం ఆగి ఉన్న టిప్పర్ లారీని ద్విచక్ర వాహనంతో వెనక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది