అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కోడేరు మండల కేంద్రంలో భాషా అనే వృద్ధుడిపై తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఖాజా మరియు బాబావలి అనే ఇద్దరు వ్యక్తులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.