కొత్తగూడెం: రక్షణ అనేది అందరి బాధ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి: సింగరేణి డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోనీ రుద్రంపూర్ కే సి ఓ ఏ క్లబ్ నందు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొత్తగూడెం, ఇల్లందు ఏరియాలో సంయుక్త రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సింగరేణి డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ అనేది అందరి బాధ్యత అని రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని అధికారులకు, కార్మికులకు సూచించారు.