కంచికామాక్షిగా శ్రీదేవిమందానాంచరేశ్వరి దర్శనం
వెంకటగిరి పట్టణం లోని భూదూరువారి వీధిలో వెలిసియున్న శ్రీదేవిమందనాంచరమ్మ దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారికి ఉదయం అభిషేకం పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారినీ కంచికామాక్షీ దేవిగా అలంకారం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.