పెదపాడు మండల వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవం గా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీగంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం వద్ద శ్రీదుర్గమ్మ అమ్మవారికి లక్షగాజుల నివేదనలో భాగంగా తొలుత గాజులుపూజ, హోమం, కుంకుమార్చనలు నిర్వహించి పెద్దసంఖ్యలో మహిళలు, మాలధారణ చేసిన భవానీలు గాజులు, అమ్మవారికి సారెతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు