మార్కాపురం: ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న పేషెంట్లను పలకరించారు. వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని డాక్టర్లు వైద్యం ఏ రకంగా చేస్తున్నారని, హాస్పటల్ పరిశుభ్రంగా ఉందా లేదా అని ఆరా తీశారు. హాస్పటల్లో ఓపీల సంఖ్య పెరిగిందన్నారు. అంబులెన్స్ కొరత ఆర్వో ప్లాంట్ అల్ట్రాసౌండ్ మిషన్ సిటీ స్కాన్ మిషన్ ఎంఆర్ఐ స్కాన్ మిషన్ కొరత ఉందని త్వరలో వాటిని ఏర్పాటు చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తామన్నారు.