ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు 524 అర్జీలు : నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 524 అర్జీలు వచ్చినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అందులో అత్యధికంగా రెవిన్యూ శాఖకు సంబంధించి(CCLA) 180, పోలీస్ శాఖకు సంబంధించి 120, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 46, నగరపాలక సంస్థకు సంబంధించి46, మరియు సర్వేనెంబర్ రికార్డుకు సంబంధించి 37 దరఖాస్తులు రాగా వివిధ శాఖలకు సంబంధించి మిగిలినవి ఉన్నాయన్నారు. వికలాంగుల అర్జీలను ఆయనే స్వయంగా వారి వద్దకు వెళ్ళి పరిశీలించారు.