పూతలపట్టు: బంగారుపాళ్యం టేకుమంద గ్రామంలో పంటలు ధ్వంసం చేసిన ఏనుగులు
బంగారుపాళ్యం టేకుమంద గ్రామ సమీపంలోని సోమవారం రాత్రి ఏనుగులు పంటపొలాలను ధ్వంసం చేశాయి. సుమారు 4 ఎకరాల్లో వరి, అరటి,మామిడి పంటలను తొక్కి పంటను అంతా నాశనం చేయడం జరిగింది. నష్టపోయిన రైతులు మాట్లాడుతూ అటవీ ప్రాంతం సరిహద్దు గ్రామాల్లోని రైతుల పంటలను తరచూ నాశనం చేస్తుంటే అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తే ఏనుగులు వచ్చి నాశనం చేస్తున్నాయని అన్నారు. అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా తరచూ ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు.