కర్నూలు: ఉల్లి పత్తి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: కర్నూలు కలెక్టరేట్ ఎదుట రైతులు రైతు సంఘాల నాయకులు ధర్నా
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కర్నూలు లో రైతులు ధర్నా నిర్వహించారు మ. సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లాలో పత్తి, మొక్కజొన్న, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు హెక్టార్ కు 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతుల నుండి కోనుగోలు చేసి ఉల్లి పంటకు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు తెలిపారు.