తాడిపత్రి లోని ఆర్జాస్ ఫ్యాక్టరీ వద్ద రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శివ గంగాధర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు సోమవారం విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్, లైసెన్స్, ఆర్ సీ లేని వాహన డ్రైవర్ల పై జరిమానా విధించారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భారీగా జరిమానా విధించారు. మొదటిసారి జరిమానాతో సరిపెట్టామని మరోసారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామన్నారు.