తనకల్లు లోని అంగన్వాడీ కేంద్రంలో బాలుడి మృతి పై అంగన్వాడీ టీచర్, హెల్పర్ అరెస్ట్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలోని ముత్యాల వారి పల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఈ ఏడాది 6వ నెల 3వ తేదీ నిశాంత్ బాబు అనే మూడేళ్ల బాలుడు సంపులో పడి మృతి చెందాడు. దీనిపై బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో అంగన్వాడీ టీచర్ రాధమ్మ, అంగన్వాడి హెల్పర్ కుల్లాయమ్మ నిర్లక్ష్యం కారణంగానే బాలుడు సంపులో పడి మృతి చెందినట్లు తేలడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.