చింతపర్తి గ్రామంలో జీవన ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కేవికే
జీవన ఎరువుల ప్రాముఖ్యత మరియు వాటి వాడకంపై కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కే మంజుల శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కే.మంజుల మాట్లాడుతూ జీవన ఎరువులు అయిన రైజోబియం, అజటోబాక్టర్, అజోస్ పైరిలం, ఫాస్ఫరస్ సలుబులైజింగ్ బ్యాక్టీరియా, ఫొటోష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా మరియు అజోల్లా గురించి మరియు వివిధ పంటలలో వాటి వాడకం గురించి వివరించారు. రైతులందరూ తప్పనిసరిగా జీవన ఎరువులను ఉపయోగించి నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరారు.పంటల సాగులో రసాయనాలు అధికంగా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా నమోదు అవుతున్నాయని అన్నారు