కొత్తగూడెం: రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ, భరోసాను కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ భరోసాను కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఉదయం 12 గంటలకు కొత్తగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.