అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ఉన్నా రాప్తాడు వద్ద ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో అనంతపురం నగరంలోని టీవీ టవర్ ప్రాంతానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.