బ్యాంకుల వద్ద ఎలాంటి చోరీలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి బ్యాంకర్లకు సూచించారు. తాడిపత్రిలోని ఏ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. అన్ని బ్యాంకులు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తే చోరీలు అరికట్టవచ్చునన్నారు.