మంత్రాలయం: సేవాభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హుండీల లెక్కింపునకు ముందుంటున్న నంద్యాలకు చెందిన బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు
మంత్రాలయం: సేవాభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హుండీల లెక్కింపునకు నంద్యాలకు చెందిన బాలాజీ సేవా ట్రస్ట్ ఆర్గనైజర్లు లీలా పరమేశ్వరి, శివమ్మ ముందుంటున్నారు. మంత్రాలయంలో మంగళవారం జరిగిన హుండీ లెక్కింపులో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీకాళహస్తి తదితర దేవాలయాల్లో హుండీల లెక్కింపునకు వెళ్తామని తెలిపారు. ఈ ట్రస్టును నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించగా 3వేల మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు.