గరిడేపల్లి: కోనాయిగూడెంకు చెందిన ఐదేళ్ల చిన్నారి యోక్షిత ప్రతిభ సూపర్బ్
గరిడేపల్లి మండలం కోనాయిగూడెంకు చెందిన ఐదేళ్ల చిన్నారి యోక్షిత చిన్నతనంలోనే తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. తెలంగాణలోని 33 జిల్లాల పేర్లను చెబుతోంది. రాష్ట్ర పక్షి, వృక్షం ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఔరా అనిపిస్తోంది. ఆ చిన్నారి చాలా చురుగ్గా ఉంటుందని, బోధించిన ప్రతీ విషయాన్ని గుర్తుంచుకుని చెబుతుందని అంగన్వాడీ టీచర్ గురవమ్మ తెలిపారు.