కర్నూలు: హెల్మెట్ లేకుండా తిరిగే బైక్ రైడర్లపై కఠిన చర్యలు తప్పవని కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ తెలిపారు.
హెల్మెట్ లేకుండా తిరిగే బైక్ రైడర్లపై కఠిన చర్యలు తప్పవని కర్నూల్ ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్ తెలిపారు. బుధవారం నగరంలో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నియమాలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించారు.ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు మొత్తం 75 మందికి జరిమానాలు విధించారు. హెల్మెట్ తెచ్చుకుని ధరించిన తరువాతే వాహనాలను విడుదల చేశారు.