ఓస్మానియా విశ్వవిద్యాలయంలో లా విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను ఎన్నిసార్లు యాజమాన్య దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ లా కాలేజీ ముందు బైఠాయించి నిరసన చేపట్టిన విద్యార్థులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్టళ్లలో మౌలిక సదుపాయాల లోపం, తాగునీటి సమస్య, భోజన నాణ్యత తగ్గడం వంటి అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.